పవన్ తో మాస్ స్టెప్స్ వేయిస్తా!

టాలెంట్ కు కష్టం జోడిస్తే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనడానికి ఒక నిదర్శనం కొరియోగ్రాఫర్ జాని మాస్టర్.దాదాపు గా తెలుగు లోని అందరూ హీరోలలో కొరియోగ్రాఫర్ గా పని చేశారు. మాస్ ను ఆకట్టుకునేలా హీరోలతో స్టెప్పులు వేయించడం జానీ ప్లస్ పాయింట్ .బుట్టబొమ్మ సిగ్నేచర్ స్టెప్ ఇపుడు టిక్ టాక్ లో కూడా బాగా వైరల్ అయింది..ట్విట్టర్ లో తన అభిమానులతో కాసేపు సరదా కబుర్లు చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చాడు జానీ మాస్టర్ .వాటిలో కొన్ని ఆసక్తికరమైన జవాబులు కూడా ఉన్నాయి..
తనకు ప్రభుదేవా స్ఫూర్తి అని,అతిలోక సుందరి శ్రీదేవి డాన్స్ అంటే తనకి ఇష్టమని చెప్పాడు. బాలకృష్ణ – బోయపాటి సినిమా లో,ntr 30 వ సినిమా లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న అని,ఏ సినిమా కి పనిచేసినా తన పాట రాగానే ధియేటర్ బద్దలు అయిపోయెలా అరుపులు రావాలని ప్రయత్నిస్తా అని అన్నాడు.
అయితే ఇప్పటిదాక చాలా హిట్ పాటలు ఇచ్చినా తనకు సంతృప్తి లేదని కానీ అతి త్వరలోనే బెస్ట్ హిట్ ఇస్తానని అన్నారు..
తను కొరియోగ్రఫీ చేసిన హీరోలతో తనకు ఉన్న అనుబంధాన్ని,షూటింగ్ టైంలో తన అనుభవాల్ని ట్విట్టర్ లో పంచుకున్నారు.. ఆర్. ఆర్. ఆర్ దేశం గర్వించదగ్గ సినిమా అవుతుందని అన్నారు..ఇక పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకిల్ సాబ్ లో పాటలకు అవకాశం ఉందని అనుకోడం లేదని కానీ భవిష్యత్ లో పవన్ తో మాస్ స్టెప్స్ వేయించాలని ఉందని మనసు లోని మాటను చెప్పాడు..సమంత ను తన కుటుంబ సభ్యురాలు లాగ భావిస్తానని చెప్పాడు..
లాక్ డౌన్ అయ్యాక వెళ్లి తన తల్లి నీ కలుస్తానని తనతో పనిచేసిన వారి యోగా క్షేమాలు స్వయం గా వెళ్లి కనుక్కుంటా అని అన్నాడు జాని మాస్టర్..

Related Articles

Back to top button