చిరు సారథ్యంలో సినిమా వర్కర్స్ హెల్పింగ్ ప్రోగ్రామ్…!

మెగాస్టార్ సారథ్యంలో మొదలుపెట్టిన సినిమా వర్కర్స్ హెల్పింగ్ ప్రోగ్రామ్ కరోనా క్రైసిస్ చారిటీకి రోజు రోజుకూ విరాళాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలోని చాలామంది ఈ చారిటీకి తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. మొదలుపెట్టిన మొదటి రోజే మూడున్నర కోట్లకు పైగా వసూలయ్యి ఈ చారిటీ అవసరాన్ని తెలియజేసింది. ఇండస్ట్రీలో చాలామంది క్రైసిస్ చారిటీకి విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. తమతో పాటు నిత్య షూటింగ్స్ లో ఉండే డైలీవేజ్ వర్కర్స్ కోసం ఈ విరాళాలను ఉపయోగించేందుకు సిద్ధమయ్యారని అందరికీ తెలిసిందే.
మాంటేజ్
వాయిస్ :
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున ఆల్రెడీ కోటి రూపాయలు ప్రటకించాడు. అయితే తన వంతుగా నాగచైతన్య ఏకంగా పాతిక లక్షలు కరోనా క్రైసిస్ చారిటీకి విరాళంగా ప్రకటించాడు. ఇక తెలుగులో ఏనాడూ ఏ విపత్తుకూ హీరోయిన్లు పెద్దగా స్పందించలేదు. కానీ ఫస్ట్ టైమ్ కరోనా క్రైసిస్ చారిటీ కోసం లావణ్య త్రిపాఠి లక్షరూపాయలు ప్రకటించింది. లేటెస్ట్ గా టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఈ చారిటీ కోసం 15లక్షలు ప్రకటించాడు. ఇక ఇదే రూట్ లో హిట్ హీరో విశ్వక్ సేన్ కూడా ఐదు లక్షలు ఇస్తున్నట్టు చెప్పాడు. ఈ చారిటీ నిర్వహణలో కూడా కొందరు సాయం చేస్తున్నారు. మొత్తంగా మెగాస్టార్ ఆశయం బాగా పనిచేస్తోంది. వీరితో పాటు ఇంకా చాలామంది ఈ కోవిడ్ -19 కరోనా క్రైసిస్ ఛారిటీ కసం సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend