మెగా బ్రదర్స్ ఆనంద సమయం


చిరంజీవి ట్విట్టర్ లో అడుగు పెట్టినప్పటి నుండి తన అభిమానులకు మరింత గా దగ్గర అవుతున్నారు..రోజుకో ఫోటో నో వీడియో నో పోస్ట్ చేస్తూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు..ఇపుడు లాక్ డౌన్ కి ముందు మెగా బ్రదర్స్ అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఫోటో నీ పోస్ట్ చేశారు.లాక్ డౌన్ కి ముందు ఒక ఆదివారం అమ్మ, తమ్ముడు, చెల్లెలతో గడిపిన ఆనంద సమయం అంటూ ట్వీట్ చేశారు..ఆ అనుభూతులను నాలాగే అందరూ మిస్ అవుతున్నారు అని అనుకుంటున్నాను అన్నారు.ఆ ఆనంద సమయాలు,కుటుంబం తో కలిపి అందరూ ఒకటై గడిపే రోజు లు త్వరలో మళ్లీ రావాలని ఆశిస్తున్నాను అంటూ తన ఫ్యామిలీ ఫోటో ను పోస్ట్ చేశారు..
చిరంజీవి ,నాగబాబు,పవన్ కళ్యాణ్,అందరూ ఎంతో సరదా గా నవ్వుతూ ఉన్న ఈ ఫోటో ను చిరు అభిమానులు అందరూ తెగ షేర్ చేస్తున్నారు.

Related Articles

Back to top button