జనజీవన స్రవంతిలో చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి పెట్టిన మూడు నెలల్లోనే పూర్తి చేయాలనే డెడ్ లైన్ ను అందుకోవడానికి కొరటాల శివ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా కథ గురించి కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం దేవాలయ భూముల వ్యవహారానికి సంబంధించిన కథ అన్నారు. కానీ తాజాగా ఈ చిత్రం షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ లీక్ అయింది.
మెగాస్టార్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తోన్న ఈ లుక్ చూస్తేనే తెలుస్తుంది ఆయన ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారని. అయితే ఇది పూర్తిగా ‘జన జీవన స్రవంతి’లో కలిసిన తర్వాత లుక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నక్సలైట్ గా కనిపించే పీరియడ్ లేట్ ఎయిటీస్ అంటున్నారు. ఆ టైమ్ లో చిన్న చిరంజీవిగా రామ్ చరణ్ నటించబోతున్నాడు. దీన్ని బట్టి ఈ పిక్ మాజీ నక్సలైట్ లుక్ అనే చెప్పాలి. కాకపోతే ఆ డ్రెస్ కోడ్ చూస్తేనే కొత్త డౌట్ వస్తోంది.
నిజానికి చాలామంది నిజాయితీ నిండిన మాజీ నక్సలైట్లు ఈ తరహా డ్రెస్ లనే బయట కూడా వాడుతుంటారు. మెడలోనో భుజాలపైనో ఎర్ర కండువా వాడుతుంటారు. చిరంజీవి కూడా అదే చేస్తున్నాడా అనిపించేలా ఉన్న ఈ లుక్ తో ఈ కథ పై ఓ క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.

Related Articles

Back to top button
Send this to a friend