పెసరట్టు తో అదరగొట్టిన గ్యాంగ్ లీడర్ …

చిరంజీవి పెసరట్టు వేశారు.#betherealman ఛాలెంజ్  లో చిరు వీడియో కోసం అందరూ ఎదురుచూస్తుంటే  ఫలానా టైం అని చెప్పి మరి వీడియో ని పోస్ట్ చేశాడు మెగాస్టార్.ప్రేమే కాదు పనులు పంచుకుందాం అంటూ ఇంటి పనులు చేస్తూనే ప్రేమ గా తన తల్లి కి బ్రేక్ ఫాస్ట్ లోకి పెసరట్టు  వేశారు.బ్యాక్ గ్రౌండ్ లో మగువ మగువ సాంగ్ తో ఫాన్స్ ను  సర్ ప్రైజ్ చేశారు.కానీ ముందు తను తినకుండా చిరు కి తినిపించారు ఆమె..అమ్మ తో కబుర్లు చెప్తూ చిరంజీవి చాలా సంతోషంగా కనిపించిన ఈ వీడియో కి అభిమానులు అంతా ఫిదా ఐపోయారు.పెట్టిన కొద్ది సేపటికే వేలల్లో షేర్ లు,కామెంట్స్  చేశారు ఫాన్స్..చిరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని,తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ ని నామినేట్ చేశారు.మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం..ఐతే తారక్ ఛాలెంజ్ కు ఓకే చెప్పిన మన వెంకటేష్  కూడా గ్యాంగ్ లీడర్ వీడియో కోసం వెయిటింగ్ అని ట్వీట్ చేశారు. గ్యాంగ్ లీడర్ దోశ వేశారు కాబట్టి బొబ్బిలి రాజా ఏం చేస్తారో చూద్దాం.. లెట్స్  వెయిట్…

Related Articles

Back to top button
Send this to a friend