నా టైమ్ ను నేను దుర్వినియోగం: చిరంజీవి

సోషల్ మీడియా ట్రోలర్స్  మెగాస్టార్ ను కూడా వదల్లేదు.తన అభిమానుల కోరిక మేరకు ఉగాది రోజున చిరు సోషల్ మీడియా లో ఎంట్రీ ఇచ్చారు.అప్పటి నుండి దాదాపుగా ప్రతి రోజు ఫాన్స్ కోసం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే  ఉన్నారు.దీన్ని కూడా కొందరు ట్రాక్ చేయడం మొదలు పెట్టారు.ఐతే చిరంజీవి మాత్రం వాటిని చూసి చూడనట్లుగా  వదిలేశారు.ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ మీద స్పందించారు మెగాస్టార్…
నా పర్మిషన్  లేకుండా నన్ను ఎవరూ బాధ పెట్టలేరు.ట్రోల్ చేసే వారిని చేసుకోనివ్వండి నేను వాటిని పట్టించుకోను అది నా స్వభావం కాదు అన్నారు.అనవసరంగా ఎదుటి వారి గురించి తప్పు గా రాయటం వారి కుసంస్కారాన్ని బయటపెడుతుంది.అలాంటి వారి రాతలు నా మీద ప్రభావం చూపించవు ,ఐనా అవి చదివి నా టైమ్ ను నేను దుర్వినియోగం చేసుకోలేను అన్నారు చిరంజీవి.. ఐనా తన నట ప్రస్థానం లో ఇలాంటివి ఎన్ని చూసుంటారో కదా??అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు..

Related Articles

Back to top button
Send this to a friend