చీమ.. ప్రేమ.. మధ్యలో భామ!”

ఈ సందర్భంగా సినీ దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు మాట్లాడుతూ… “ప్రత్యేకించి అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, జపాన్ మొదలైన దేశాల్లో వివిధ అంతర్జాతీయ ఫిల్మ్ ఫిస్టివల్స్‌లో పాల్గొని, ఆయా విభాగాల్లో BEST FEATURE FILM, BEST DIRECTOR వంటి అవార్డులు అందుకుని తెలుగు చిత్రాలకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఈ సినిమా కోసం స్వర్గీయ ఎస్.పి.బాలు ఒక పాటను ఆలపించడం జరిగింది, అలాగే ఈ సినిమా ద్వారా ఇందు, అమిత్ నాయికా, నాయకులుగా పరిచయమై మెప్పించారు. రవివర్మ పోటీదార్ చక్కని సంగీతాన్ని సమకూర్చగా.., ఆరీఫ్ లలాని కెమెరా నైపుణ్యతను కనబరిచారు. హరి శంకర్ ఎడిటింగ్‌లో తనదైన ముద్ర వేశారు” అని అన్నారు.

సినిమా నిర్మాత S.N. లక్ష్మీనారాయణ “ఈ చిన్న సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజుకు ఇది మొదటి చిత్రం! అయినప్పటికీ శ్రీకాంత్ సృజనాత్మకత, రాజీపడని చిత్రీకరణ శైలి సినిమా విజయపధంలో పయనించేందుకు ఎంతగానో సహాయపడ్డాయి!” అన్నారు.

నిర్మాత, దర్శకుడు తమ ‘చీమ’ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకూ, చిత్ర బృందానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మీడియా ముఖంగా తెలియజేశారు. దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు మరో కొత్త కథతో మన ముందుకు రాబోతున్నారు. ఆ వివరాలు త్వరలోనే ప్రకటించబడతాయి!

Related Articles

Back to top button
Send this to a friend