జర్నలిస్టులకు కూడా నిత్యావసర సరుకుల పంపిణీ

మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సి సి సి ద్వారా సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ వారికి నిత్యావసర సరుకులు ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే సినిమా జర్నలిస్టులకు కూడా సి సి సి వారు నిత్యావసర సరుకులను ఇస్తున్నారనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను.

గమనిక: నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా సినిమా జర్నలిస్టు అయిన అందరికీ ఇవ్వాలనే చిరంజీవి గారి కోరికను సి సి సి కమిటీ ఆమోదించి , సరఫరా చేసేందుకు సిద్ధమైంది. కాబట్టి సినీ జర్నలిస్టులు అందరూ తప్పకుండా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లేదా రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్దకు వచ్చి తీసుకు వెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం.

Related Articles

Back to top button
Send this to a friend