బ్రహ్మి గీసిన బొమ్మ…

కరోనా మనకు జీవిత పాఠాన్ని నేర్పింది అంటున్నారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం.ప్రకృతి లో ఏదీ శాశ్వతం కాదు.మార్పు అనేది సహజం.మనిషి లో కూడా మార్పు రావాలి .ప్రకృతి కి అందరూ సమానమే,అలాగే మనిషి కూడా అందరిని సమానంగా చూడగలగాలి,కష్టాలలో వున్న ఎదుటివాడు నా కుటుంబ సభ్యుడే అనుకుని సహాయం చేయగలిగే మనసు రావాలి అంటున్నారు బ్రహ్మానందం.ఇక లాక్ డౌన్ లో తాను కుటుంబం తో గడుపుతున్నా కానీ కుటుంబాలకు దూరంగా ఆకలి కి దగ్గరగా బ్రతుకు పోరాటం చేస్తున్న వలస కూలీల ను చూస్తే చాలా మనోవేదన కలుగుతుందని అలాంటి వారికి వీలైనంత సాయం చేద్దామని పిలుపునిచ్చారు.మట్టి తో బొమ్మలు తయారు చేయడం, చిత్ర లేఖనం తనకు చిన్నప్పటి నుండి తెలిసిన విద్యే అంటున్నారు. ఇపుడు మంచి సమయం దొరికింది కాబట్టి శ్రీ శ్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్, చాగంటి వారి బొమ్మలు గీశానని తన భార్య లక్ష్మి ఈ విషయం లో మంచి విమర్శకురాలని తనకు గీయడం రాకపోయినా కూడా అంటూ చమత్కరించారు..

Related Articles

Back to top button