ఆది సాయికుమార్ కాంబినేష‌న్ లో “బ్లాక్”‌

మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే మాస్‌క‌మ‌ర్షియ‌ల్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, ఆట‌గాడు చిత్రం తో ప‌రిచ‌యమైన ద‌‌ర్శ‌నాబానిక్ ని హీరోయిన్ గా, జి.బి.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో మ‌హంకాళి దివాక‌ర్ నిర్మాత‌గా మ‌హంకాళి మూవీస్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ ని యూనిట్ క‌న‌ఫ‌ర్మ్ చేసారు. లాక్‌డౌన్ కి ముందు షూటింగ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఈచిత్ర షూటింగ్ 70% పూర్తిచేసుకుంది. మిగ‌తా బ్యాల‌న్స్ షూటింగ్ ని లాక్‌డౌన్ త‌రువాత పూర్తిచేసి విడుద‌ల‌కి చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈరోజు ఈచిత్రం యెక్క టైటిల్ ని కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ మ‌రియు మేకింగ్ ని విడుద‌ల చేయ‌టం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌హంకాళి దివాక‌ర్ మాట్లాడుతూ.. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ని ఖరారు చేసాము. టైటిల్ తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని మరియు వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశాము. ఈ చిత్రానికి ఇప్ప‌టికే భారి అంచ‌నాలు వుండ‌టంతో ఈ మేకింగ్ మ‌రింత క్రేజ్ ని తీసుకువ‌చ్చింది. ఎంతో కసిగా సక్సెస్ కోసం చూస్తున్న హీరో ఆదికి గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ కోణంలో కొత్తగా ఉంటుంది, ఈ చిత్రం ఆది కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. భారీ సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాము. ఆది సాయికుమార్ అభిమానుల‌, సిని ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకుంటుంద‌ని అని నిర్మాత అన్నారు.

న‌టీన‌టులు..

హీరోయిన్ – దర్శనా బానిక్,
బిగ్ బాస్ కౌశల్
ఆమని
వెన్నెల కిషోర్
శ్యామ్ కృష్ణ
సూర్య
చక్రపాణి
విశ్వేశ్వరరావు
ప్రియదర్శన్
తాగుబోతు రమేష్
శ్రీనివాస్ చక్రవర్తి
చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి

టెక్నిషియ‌న్స్‌…

రచన దర్శకత్వం – జీ.బి కృష్ణ
నిర్మాత – మహంకాళి దివాకర్
కెమెరామెన్ – సతీష్ ముత్యాల
మ్యూజిక్ డైరెక్టర్ – సురేష్ బొబ్బిల
ఎడిటర్ – అమర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ – కె.వి.రమణ
స్టంట్స్ – రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శంకర్
పి.ఆర్.ఓ -ఏలూరు శీను

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami