ఎమ్మెల్యే అయి ఉండి బాధ్యత ఉండక్కర్లేదా?

యు.పి. బిజెపి ఎమ్మెల్యే సురేష్ తివారి ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.ఉత్తరప్రదేశ్ ,భర్హాస్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఎవరూ కూడా ముస్లింల వద్ద దయచేసి కూరగాయలు కానీ మరే ఇతర వస్తువులు కానీ కొనవద్దని  సూచించారు.ఢిల్లీ లో జరిగిన మత ప్రార్థనలే కరోనా దేశంలో వ్యాపించడానికి కారణంగా మారాయి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వీడియో సోషల్ మీడియా అప్లోడ్ అయిన కొద్ది సేపటికే వైరల్ గా మారింది.ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరి కాదని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.సురేష్ వ్యాఖ్యల పై తక్షణమే ప్రభుత్వం స్పందించి అతనిపై దేశ ద్రోహ కేసు నమోదు చేయాలని సమాజ్ వాద్ పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ బంధు ప్రియ డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే తీరు పై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు..

Related Articles

Back to top button