అంజలితో అడ్జెస్ట్ అవుతోన్న బాలయ్య

Balakrishna to romance Anjali finally


నిన్నటి తరం స్టార్ హీరోల్లో ఒకడైన బాలయ్యకు కొత్త సినిమా మొదలుపెట్టిన ప్రతిసారీ వచ్చే సమస్య ఈ సారి కాస్త తీవ్రంగా మారింది. అదే హీరోయిన్ల సమస్య అని వేరే చెప్పక్కర్లేదు. ఇది కేవలం బాలయ్యకు మాత్రమే కాదు.. ఆ తరం హీరోలందరికీ ఉన్నదే. అయితే లేటెస్ట్ గా బోయపాటితో సినిమా అంటే క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి హీరోయిన్లు సులువుగా దొరుకుతారు అనుకున్నారు. బట్ అందరికీ షాక్ ఇస్తూ ప్రతి హీరోయిన్ నో చెబుతోంది. ఫైనల్ గా రాజోలు బ్యూటీ అంజలి వద్ద ఆగారట.
బాలయ్య సినిమాలో హీరోయిన్ అంటే అయితే స్ట్రాంగ్, లేదంటే బోల్డ్ అన్న ముద్ర పడింది. ఈ రెండు కేటగిరీల్లోనూ కనిపించే సత్తా ఉన్న అంజలిని హీరోయిన్ గా ఫైనల్ చేశారట. అయితే మరో హీరోయిన్ గా శ్రీయనే కన్ఫార్మ్ చేశారనే వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం కూడా ఈ వార్తలు వచ్చినా.. అప్పుడు శ్రీయ కాదని చెప్పింది. బట్ ఫైనల్ గా తనతోనే ఓకే చేయిస్తున్నారు అంటున్నారు.
బాలయ్య రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించే ఈ సినిమాకు హీరోయిన్లు ఫైనల్ కాగానే ముహూర్తం స్టార్ట్ అవుతుంది అంటున్నారు .

Related Articles

Back to top button