అనుష్క.. ఇంత నిశ్శబ్ధం ఎందుకు


స్వీటీ బ్యూటీగా సౌత్ లో తనకంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. కొంతకాలంగా ఇంటికే పరిమితం అయింది. బాహుబలి తర్వాత భాగమతితో సోలోగా సత్తా చాటిన అనుష్క.. ఆ తర్వాత మరో సినిమా చేయడానికి చాలా టైమే తీసుకుంది. ఇక హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేసిన ప్యాన్ ఇండియన్ సినిమా ‘నిశ్శబ్ధం’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో కానీ, టీజర్, సాంగ్ విడుదల .. ఇలా ఏ సందర్భంలోనూ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ కాలేదు. కనీసం మీడియానూ పట్టించుకోవడం లేదు.
అయితే నిశ్శబ్ధం సినిమా జనవరి చివరిలోవిడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాకు అస్సలు బజ్ లేదు. బిజినెస్ వర్గాల్లోనూ పెద్దగా ఆసక్తి కనిపించలేదు. దీంతో కేవలం థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడం వల్లే నిరవధికంగా వాయిదా వేశారు. ఏప్రిల్ 2న విడుదలవుతుంది అని మాత్రం చెప్పారు. సినిమా కోసం అనే కాదు.. ఏ సందర్భంలోనూ అనుష్క సినిమా సర్కిల్స్ లో కనిపించడం లేదు. తను బయటకు వస్తే ప్రభాస్ తో ఏదో ఒక లింక్ పెట్టి రూమర్స్ వేస్తున్నారనే కోపమా లేక.. తను బాగా లావుగా మారడం వల్ల నెగెటివ్ కమెంట్స్ వస్తాయనే భయమా అనేది తెలియడం లేదు. కానీ ఓ స్టార్ హీరోయిన్.. ఇంకా క్రేజ్ ఉన్న నటి ఇలా కామ్ గా నాలుగు గోడలకే పరిమితం కావడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఏమై ఉంటుంది తనకు.

Related Articles

Back to top button
Send this to a friend