రాఘవన్ సీక్వెల్ లో అనుష్క..!


దేశంలో టాలెంటెడ్ అనిపించుకున్న ప్రతి దర్శకుడికీ ఓ శైలి ఉంటుంది. ఆ స్టైల్స్ ను ఇష్టపడేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే సౌత్ లో గౌతమ్ మీనన్ సినిమాలకూ ఓ స్టైల్ ఉంది. అదేంటో అందరికీ తెలుసు. అతని సినిమాలు అత్యంత స్టైలిష్ గా ఉంటాయి. అలాంటి దర్శకుడు తన గత సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ తీస్తా అంటున్నాడు. అందులో ఓ సీక్వెల్ లో అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
2006లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా వేట్టైయాడు విలైయాడు.. తెలుగులో ఇదే సినిమాను రాఘవన్ గా డబ్ చేశారు. జ్యోతిక, కమలిని ముఖర్జీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ క్యారెక్టర్ ను అత్యంత స్టైలిష్ గా రూపొందించాడు దర్శకుడు. కొంత వరకూ తెలుగులో వెంకటేష్ చేసిన ఘర్షణ పోలికలు కనిపించినా భిన్నమైన నేపథ్యాల్లో కథను నడిపించిన గౌతమ్ ఈ సినిమాను కూడా హిట్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీకి సీక్వెల్ చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా కమల్ కూడా ఓకే చెప్పాడట. అందుకే ప్రయత్నాలు స్పీడప్ చేశాడు.
వేట్టైయాడు విలైయాడు -2 స్క్రిప్ట్ సిద్ధం అయిందట. ఈ కథను కమల్ తో కూడా ఓకే చేయించుకున్నాడు గౌతమ్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లోనే అనుష్క ను హీరోయిన్ గా తీసుకున్నారు. మామూలుగా అనుష్కకు గౌతమ్ అంటే చాలా అభిమానం. అందుకే అతను ఎప్పుడు అడిగినా తన కాల్షీట్స్ ఇస్తానని ఎప్పుడూ చెబుతుంది. ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తర్వాత తను మరే ప్రాజెక్ట్ నూ ఓకే చేయలేదు. అందుకు కారణం ఈ మూవీనే అంటున్నారు. మరోవైపు కమల్ హాసన్ భారతీయుడు -2 చేస్తున్నాడు. ఈ మూవీ చివరి దశకు రాగానే రాఘవన్ కు సీక్వెల్ మొదలవుతుందట. మరి ఇదే నిజమైతే అనుష్క నెక్ట్స్ మూవీ ఇదే అనుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend