కిషన్ రెడ్డికి క్లాస్ పీకిన అమిత్ షా!


సెంట్రల్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి.. ఆ పదవి వచ్చిన తర్వాత ఉన్న మతి పోయిన్టటుగా అప్పుడప్పుడూ కమెంట్స్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం రోహింగ్యాల గురించి కాంట్రవర్శీయల్ కమెంట్స్ చేసిన అతను తన పార్టీ పెద్దల చేతిలో అక్షింతలు తిన్నాడు. అయితే అన్నిటికంటే దారుణంగా అతను రీసెంట్ గా చేసిన విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు ఎర్రబస్ తప్ప ఏమీ తెలియదు. మోడీ వచ్చిన తర్వాతే రైలును చూశారు అంటూ అతి చవకబారు కమెంట్స్ చేశాడు. దీనిపై సోషల్ మీడియలో ఓ రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తాయి. అదే టైమ్ లో విపరీతమైన జోక్స్ కూడా ట్రోల్ అయ్యాయి.
అయితే ఈ ఎర్రబస్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డిపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడట. నోటికి ఏది వస్తే అది మాట్లాడ్డం కాదు. కాస్త అదుపులో ఉంచుకోవాలి. మీకంటే ప్రజలకు చాలా తెలుసు. వారికి తెలియదు అనే అహంకార ధోరణి అందరి ముందు అన్నిసార్లూ ప్రదర్శించడం కరెక్ట్ కాదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. దీంతో ముందు వణికిపోయిన కిషన్ రెడ్డి తర్వాత ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని అప్పటికి బయటపడ్డాడు అనేది లేటెస్ట్ హాట్ న్యూస్. ఏదేమైనా పొలిటికల్ గా తమ పార్టీలకు మైలేజ్ తెచ్చుకునే వ్యాఖ్యల వరకూ ఓకే కానీ.. ఇలా అడ్డమైన వాదనలు చేస్తే మాత్ర సొంత వారి చేతిలో కూడా చులకన కాక తప్పదు.

Related Articles

Back to top button