అల్లు శిరీష్ పై స్పెషల్ వీడియో చేసిన అయాన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటారు అనే విషయం తెలిసిందే. అల్లు శిరీష్ కూడా ఇదే రీతిన సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇటీవల కాలం లో శిరీష్ పోస్ట్ చేసిన అనేక అప్డేట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయ్. తాజాగా స్టైల్ స్టార్ అల్లు అర్జున్, తన తనయుడు తో కలిసి ఉన్న ఒక వీడియో ని పోస్ట్ చేశారు. ఈ వీడియో లో అల్లు అయాన్ తన బాబాయ్ శిరీష్ పెళ్లి గురించి ఆపిల్ శిరి ని అడగటంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. అంతే కాదు ఇప్పటి వరకు తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే అల్లు శిరీష్ ని శిరి అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా అల్లు శిరీష్ కాస్త శిరి గా ఫేమస్ అయిపోయారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ కూడా ఈ వీడియో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేశారు. ఇక ప్రస్తుతం శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన పనుల్లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటనతో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami