స్టైలిష్ స్టార్ .. లారీ డ్రైవర్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ తో పాటు నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా కొట్టేశాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమాకు ప్రిపేర్ అవుతున్నాడు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం దొంగల నేపథ్యంలో కథ నడుస్తుంది. అందుకోసం అర్జున్ చిత్తూరు యాసను కూడా నేర్చుకుంటున్నాడు. పాత్ర సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీని లారీ డ్రైవర్ గా చూపించబోతున్నాడట సుకుమార్. ఈ తరహా పాత్రలో ఇప్పటి వరకూ మన తెలుగు స్టార్ హీరోలెవరూ కనిపించలేదు అంటున్నారు సుకుమార్ టీమ్ మెంబర్స్.
ఎర్రచందనం దొంగలు నరికిన దుంగలను స్టేట్స్ దాటించే పనిలో అల్లు అర్జున్ ఉంటాడట. తన లారీలోనే ఆ సాహసాలు చేస్తాడు అంటున్నారు. అయితే అతన్ని పట్టుకోవడానికి వచ్చే ఫారెస్ట్ ఆఫీసర్స్ ను చాకచక్యంగా తప్పించుకుంటూ ఉంటాడట. ఈ క్రమంలో వచ్చే సీన్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా చిత్రీకరించబోతున్నారని టాక్. రంగస్థలంలో చిట్టిబాబు తరహాలో ఓ రగ్గ్ డ్ గా ఉండే క్యారెక్టర్ నే అల్లు అర్జున్ కోసం డిజైన్ చేశాడు సుకుమార్ అంటున్నారు. మొత్తంగా ఈ మూవీతో బన్నీ మరో బ్లాక్ బస్టర్ కొట్టడా ఖాయం అనే మాట వినిపిస్తోంది.

Related Articles

Back to top button
Send this to a friend