ఛాలెంజ్ ను స్వీకరించిన దిగాంగన

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది ఆయన పిలుపు మేరకు సిని ప్రముఖులు; క్రీడాకారులు; వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేయించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ దిగాంగనాసూర్యవంశీ ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని దినిలోకి తనను ఆహ్వానించిన దర్శకుడు సంపత్ నంది కి కృతజ్ఞతలు తెలిపారు. దినిలో అందరూ పాల్గొని భాద్యతగా మొక్కలు నాటాలని ట్విట్టర్ ఖాతాలో తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది.

Related Articles

Back to top button
Close

Send this to a friend