ఆ బాలీవుడ్ నటి కరోనా పేషెంట్స్ కు సేవలు..!

తాము నేర్చుకున్నది పదిమందికీ పంచడమే కదా చదువు అంటే. అయితే కొన్ని సందర్భాల్లో అది స్వార్ధానికి వెళుతుంది. కానీ ఈ హీరోయిన్ మాత్రం అత్యంత సాహసోపేతైన నిర్ణయ తీసుకుంది. ఒక వైపు కరోనా పేరు చెబితే ఆమడ దూరం వెళుతున్నారు సెలబ్రిటీస్. అదే టైమ్ లో దానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఆలోచిస్తున్నారు సామాన్య జనం. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా కరోనా పేషెంట్స్ కు సేవలు చేస్తూ సెహభాష్ అనిపించుకుంటోంది. ఎంతోమంది ప్రైవేట్ వైద్యులు కూడా కరోనా బాధితులకు చికిత్సం అందించడానికి ముందుకు రావడం లేదు. కానీ తను ఓ సెలబ్రిటీ అయి ఉండి కూడా ఇలా పేషెంట్స్ కే సేవలు చేస్తుండటం ఎంతోమందిని ఆలోచింప చేస్తోంది. ఇంతకీ తనెవరో చెప్పలేదు కదూ.. ఈ నటి పేరు శిఖా మల్హోత్రా. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘ఫ్యాన్’ సినిమాతో ఆమెకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోన్న తను ఇలా మెడికల్ సర్వీస్ కు రావడానికి ఓ కారణం ఉంది.
శిఖా మల్హోత్రా కేవలం నటి మాత్రమే కాదు.. అంతకు ముందే తను ఢిల్లీలోని మహావీర్ మెడికల్ కాలేజ్, సఫ్ దర్ జంగ్ హాస్పిటల్ లో నర్సింగ్ డిగ్రీ చేసింది. ఆ ఎక్స్ పీరియన్స్ తోనే ఇలా ఇప్పుడు కరోనా పేషెంట్స్ కు సేవలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘నా దేశానికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరంతా ఇళ్లలోనే ఉండండి’అంటూ తను చేసిన పోస్ట్ కు మంచి స్పందన వస్తోంది.
నిజానికి శిఖా చేస్తోన్న సేవలు డబ్బుకంటే గొప్పవి. ఎందుకంటే తను ఏకంగా ప్రాణాలనే ఫణంగా పెట్టి మరీ సర్వీస్ చేస్తోంది. హ్యాట్సాఫ్ శిఖా ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend