అమ్మోరులా నయనతార
సౌత్ లో అనేక ఢక్కామొక్కీలు తిన్న తర్వాత తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ నయనతార. ఒకప్పుడు కేవలం గ్లామర్ తారగానే అలరించినా.. కొన్నాళ్లుగా.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో మీడియం రేంజ్ హీరోల స్థాయిలో మార్కెట్ ఫామ్ చేసుకుంది. ప్రస్తుతం అలాంటి సినిమాలతోనే దూసుకుపోతోన్న నయన్ లేటెస్ట్ గా అమ్మోరు లా కనిపించబోతోంది.
నయనతార అమ్మోరులా బావుంటుందా అని గతంలో అనుకున్న వారి నోళ్లు మూతపడేలా ఈ కొత్త లుక్ కనిపిస్తోంది. అమ్మోరులా నయన అచ్చు గుద్దినట్టుగా సరిపోయింది. గత ఇమేజ్ తాలూకూ ఏ ఎక్స్ ప్రెషన్ లేకుండా అచ్చంగా అమ్మవారినే తలపిస్తోంది. గతంలో కూడా తెలుగులో శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు తీసుకుంటే చాలామంది విమర్శించారు. కానీ ఆ విమర్శలను తన నటనతో తోసిపుచ్చింది. ఇప్పుడు కూడా లుక్ తోనే మెస్మరైజ్ చేస్తోంది.
ఎన్.జే. శరవణన్, బాలాజీ సంయుక్తింగా నిర్మిస్తోన్న ఈ చిత్రం పేరు ‘మూకుతి అమ్మన్’. మొత్తంగా ఒకప్పుడు అమ్మోరు అంటే రమ్యకృష్ణ, భానుప్రియ వంటి తారలు కనిపించేవారు. ఇప్పుడు నయన్ కూడా వారి రూట్లోనే వెళుతోంది.