31వరకూ థియేటర్స్ మూసేయాల్సిందే

కరోనా ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్స్ ను గతంలోనే మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయానికి తలొంచి సినిమా పరిశ్రమ, నిర్మాతల మండలి ఆ మేరకు అన్ని థియేటర్స్ ను మూసివేసింది. అయితే మొదట ఈ థియేటర్స్ బందర్ ను ఈ నెల 21 వరకే అనుకున్నారు. కానీ తాజాగా కరోనా ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోంది. పాజిటివ్ కేస్ లు పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. కొందరు సెలబ్రిటీస్ సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో మరోసారి నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తో పాటు పరిశ్రమకు సంబంధించిన 24క్రాఫ్ట్స్ యూనియన్స్ ముఖ్యులు కూర్చుకుని చర్చించారు. ఈ చర్చల తర్వాత థియేటర్స్ బంద్ ను ఈ నెల 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పాటు షూటింగ్ లను కూడా ఆ రోజు వరకూ నిలిపేయాలని నిర్ణయించారు. అయితే ఆ డేట్ కూడా తాత్కాలికమే. అప్పటి వరకూ కరోనా విజృంభణ తగ్గితే ఫర్వాలేదు. లేదంటే మరోసారి థియేటర్స్ మూతపై నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు దేశమంతా కరోనా చాలా వేగంగా విస్తరిస్తోంది. అందువల్ల ఈ థియేటర్స్ బంద్ ఏప్రిల్ లో కూడా కొనసాగుతుంది అనిపిస్తోంది.

Related Articles

Back to top button
Send this to a friend