తెగువ కు తగిన గుర్తింపు..సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్!

లాక్ డౌన్ టైమ్ లో కారణం లేకుండా బయటకి వచ్చిన వారిని పోలీసులు కొట్టిన వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.. కానీ బాధ్యత గా విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద కూడా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి..పంజాబ్ లో రోడ్డు మీదకి రావద్దు అని ఆకతాయిలను అడ్డుకున్నారని ఒక పోలీస్ చేయి నరికేశారు కొందరు..
పంజాబ్ పాటియాలా పోలీస్ స్టేషన్ పరిధిలో నీ కూరగాయల మండి దగ్గర భౌతిక దూరం పాటించకుండా గుమిగూడిన జనాల్ని చేదరగొడుతున్న హర్జి త్ సింగ్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు.ఈ దాడి లో హార్జీత్ మణికట్టు తెగి పడిపోయింది అయినా కూడా లెక్క చేయకుండా వాళ్లందరినీ అక్కడ నుండి తరిమేశాకే హర్జీత్ తన తెగిన చేయి తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు.

గంటల పాటు శ్రమించి మైక్రో సర్జరీ చేసి డాక్టర్స్ చేతిని అతికించారు..పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ దగ్గరుండి మరి సర్జీరీ చేయించారు..అయితే ఇపుడు హర్జిత్ చూపిన తెగువ కు గుర్తింపు దక్కింది…అతని సాహసానికి మెచ్చిన ప్రభుత్వం ఇపుడు Singh కు ప్రమోషన్ ఇచ్చింది..Asi స్థాయి నుండి సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు..అంతేకాకుండా దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు…
ఎంతైనా హార్జిత్ సింగ్ గ్రేట్ కదా ఇటువంటి పోలీసులు నిజంగా దేశానికి అవసరం అని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు.కానీ బాధ్యత గా విధులు నిర్వహిస్తున్న వారి మీద ఇలా విచక్షణ కోల్పోయి దాడులు చేయడం దుర్మార్గమని ఖండిస్తున్నారు…

Related Articles

Back to top button
Send this to a friend