పెంగ్విన్ టీజ‌ర్ ను రిలీజ్ చేస్తున్న హీరోయిన్స్

    Written By: Last Updated:

మహాన‌టి ఫేమ్ కీర్తి సురేశ్ అప్ క‌మింగ్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ పెంగ్విన్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎమోజాన్ ప్రైమ్ వీడియో వారు జూన్ 19న విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ టీజ‌ర్ ను జూన్ 8న విడుద‌ల చేయ‌డానికి ఎమెజాన్ టీమ్ ప్లాన్ చేసింది. ఈ టీజ‌ర్ ను తెలుగు, మ‌ళ‌యాల‌, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు. స్టార్ హీరోయిన్లు తాప్సీ ప‌న్ను, స‌మంత‌, మంజు వారియ‌ర్, త్రిష ఈ టీజ‌ర్ ని జూన్ 8న త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలు ద్వారా విడుద‌ల చేస్తున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ ప‌తాకం పై ద‌ర్శ‌క నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు