హ్యాపీ బర్త్ డే గబ్బర్ సింగ్  

హరీశ్ శంకర్.. తెలుగులో ఉన్న మాస్ దర్శకుల్లో ఒకడు. తొలి సినిమాతో షాక్ తిన్నా తర్వాత తనలో ఎంత ఘాటు ఉందో మిరపకాయ్ తో నిరూపించాడు. పవన్ కళ్యాణ్ కు కమ్ బ్యాక్ అని చెప్పదగ్గ గబ్బర్ సింగ్ తో అప్పటికి ఉన్న ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్  క్రియేట్ చేశాడు. దర్శకుడుగా, రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీ ఏర్పాటు చేసుకున్న హరీశ్ శంకర్ పనిలో కూడా గబ్బర్ సింగ్ లాగానే వ్యవహరిస్తాడు. అందుకే అతనికి జయాపజయాలకు అతీతంగా కనిపిస్తాడు. ఇవాళ హరీశ్ శంకర్ పుట్టిన రోజు. అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ అతని కెరీర్ ను బ్రీఫ్ గా చూద్దాం..
జగిత్యాల జిల్లా ధర్మ పురిలో పుట్టాడు హరీశ్ శంకర్. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగాడు. తండ్రి తెలుగు టీచర్ కావడంతో సాహిత్యంపైనా మక్కువ పెంచుకున్నాడు. బాల్యంలో కొన్ని నాటకాల్లో బాలనటుడుగానూ నటించాడు. చిన్నతనం నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్న హరీష్ ఫైనల్ గా ఇండస్ట్రీకే వచ్చాడు. తొలినాళ్లలో స్క్రీన్ రైటర్ గా పనిచేసిన అతనిలో ఓ ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ ను రామ్ గోపాల్ వర్మ పసిగట్టాడు. అందుకే దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చాడు. రవితేజ హీరోగా షాక్ సినిమాతో దర్శకుడుగా మారాడు హరీష్ శంకర్. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. అయినా దర్శరకుడుగా మంచి మార్కులు కొట్టేశాడు.
తనలాంటి ఫైర్ ను ఇతరుల్లో గమనిస్తే ఎక్కువగా ఇష్టపడతాడు మాస్ రాజా రవితేజ. అందుకే హరీష్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సారి మిస్ కాలేదు. మిరపకాయ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన మిరపకాయ్ తో ఒక్కసారిగా మాస్ ఆడియన్స్ ను తెగ నచ్చాడు.
తను మిరపకాయ్ తీస్తోన్న టైమ్ కు అటు పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. మధ్యలో జల్సా మాత్రమే హిట్ అనిపించుకుంది. మరి ఏం చూశాడో కానీ పవన్ కళ్యాణ్ కూడా హరీష్ ను నమ్మాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంద్ ను రీమేక్ చేస్తూ గబ్బర్ సింగ్ గా పవన్ ను అతను ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ మూవీతో పవర్ స్టార్ సైతం మళ్లీ తన అభిమానులు మురిసిపోయే హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతోనే టాప్ డైరక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లాడు హరీష్.
గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య వీరి కాంబినేషన్ లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా.. ఫ్లాప్ అయింది. దీంతో కొంత గ్యాప్ వచ్చింది. కాస్త ఆలస్యంగానే సాయితేజ్ హీరోగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్ అందుకుని ఆ వెంటనే మెగా క్యాంప్ లోనే అల్లు అర్జున్ ను ఒప్పించాడు. మళ్లీ భారీ అంచనాలతో వచ్చిన దువ్వాడ జగన్నాథ్ జస్ట్ హిట్ అనిపించుకుంది.
డిజే యావరేజ్ అనిపించుకోవడంతో మళ్లీ గ్యాప్ వచ్చింది. అయినా మళ్లీ మెగా క్యాంప్ లోని మినీ హీరో వరుణ్ తేజ్ తో రీసెంట్ గా గద్దలకొండ గణేష్ అంటూ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఏంటా అనుకుంటోన్న టైమ్ లో అనూహ్యంగా మళ్లీ పవన్ కళ్యాణ్ చాన్స్ ఇచ్చాడు. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. గబ్బర్ సింగ్ కాంబినేష్ కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. హరీష్ శంకర్ కూడా ఓ భారీ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను డబుల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడిప్పుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరి ఈ మూవీతో హరీష్ శంకర్ భారీ హిట్ అందుకోవాలని కోరుకుంటూ మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend