హృతిక్ మనసు పడ్డాడు, అజయ్ గండి కొట్టాడు

సౌత్ లో ఓ సినిమా హిట్ అయిందంటే చాలు.. బాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ లన్నీ ఓ లుక్ వేస్తున్నాయి. వరుసగా ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ చేస్తున్నారు. కంటెంట్ బలంగా ఉండి.. కాస్త యూనివర్సల్ అప్పీల్ ఉంటే చాలు.. వాళ్లు మన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ లుక్ తమిళ్ బ్లాక్ బస్టర్ ఖైదీపై పడింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రైట్స్ కొనేసింది. ఇప్పుడు మరో బిగ్ ప్రొడక్షన్ హౌస్ బిగ్ వారియర్ తో కలిసి సినిమాను పట్టాలెక్కించబోతోంది. హీరోగా అజయ్ దేవ్ గణ్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి ఈ సినిమాలో హీరోగా నటించాలని హృతిక్ రోషన్ బలంగా కోరుకున్నాడు. అందుకు తగ్గట్టుగా కొన్ని నిర్మాణ సంస్థలకు తెలిసేలా హింట్స్ కూడా ఇచ్చాడు. కానీ వీళ్లు మాత్రం అజయ్ దేవ్ గణ్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు టాక్. అజయ్ కూడా ఈ పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడట. దీంతో హృతిక్ ఆశలపై రిలయన్స్ నీళ్లు చల్లింది అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాతో తమిళ్ లో కార్తీ ఫస్ట్ టైమ్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. లోకే ష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ ఒన్ నైట్ థ్రిల్లర్ కు స్పెల్ బౌండ్ కాని ఆడియన్ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ కంటెంట్ కు భాషతో పనిలేదు. కాబట్టి బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ సాధించినా ఆశ్చర్యం లేదు.

Related Articles

Back to top button
Send this to a friend