హార్ట్ ఆపరేషన్ జరిగింది. నేను క్షేమమే: శశి

హార్ట్ ఆపరేషన్ జరిగింది. నేను క్షేమమే! - సంగీత దర్శకుడు శశి ప్రీతమ్

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’, ‘సముద్రం’ తదితర చిత్రాలు ఆయన సంగీతం అందించారు. తన ఆరోగ్యం గురించి పలు వార్తలు నేపథ్యంలో శశి ప్రీతమ్ వివరణ ఇచ్చారు.

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ “ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది. వెంటనే నా మిత్రుడు రాజు గారు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హార్ట్ లో బ్లాక్ ఉందని యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్ వేశారు. మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ పేరుపేరునా థాంక్స్” అని అన్నారు.

డాక్టర్ అమీనుద్దిన్ ఒవైసీ మాట్లాడుతూ ‌”సెంచరీ హాస్పిటల్ లో శశి ప్రీతమ్ కన్సల్టెంట్ డాక్టర్ నేనే. జూన్ 4న ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన మా దగ్గరికి వచ్చారు. హార్ట్ ఎటాక్ అని గ్రహించాను. యాంజియోగ్రామ్ చేసి, తర్వాత స్టంట్ వేశాం. ‌ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఐసీయూలో 24 గంటల్లో అబ్జర్వేషన్ లో ఉంచాము. ఆయన చాలా త్వరగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన వాకింగ్ కూడా చేస్తున్నారు. ఆయనకు ఇతర సమస్యలు ఏవీ లేవు. ఇతర వ్యాధి లక్షణాలు కూడా కనిపించలేదు” అని అన్నారు.

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami