హను రాఘవపూడికి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్

హను రాఘవపూడి.. తెలుగులో డిఫరెంట్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తీయడంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్నాడు హను రాఘవపూడి. కానీ తర్వాత యాక్షన్ కోసం చేసిన ప్రయత్నం లై సినిమాతో దెబ్బకొట్టింది. అలాగే శర్వానంద్, సాయిపల్లవి వంటి క్రేజీ కపుల్ తో తీసిన పడిపడి లేచె మనసే సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇక తెలుగు నిర్మాతలు అతనంటేనే భయపడుతున్నారు. ఈ టైమ్ లో మనోడు సైలెంట్ గా ఉన్నాడు అనుకుంటే సడన్ గా బాలీవుడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
హను రాఘవపూడి బాలీవుడ్ కు వెళుతున్నాడు అంటే అంతా లైట్ తీసుకున్నారు. కానీ అతను నిజంగానే అక్కడ ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. కాకపోతేఓ అవుట్ డేటెడ్ హీరోతో. ఒకప్పుడు బాలీవుడ్ లో భారీ దేశభక్తి యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న సన్నిడియోల్ తో హను రాఘవపూడి సినిమా చేస్తున్నాడు. అనూజ్ శర్మ అనే నిర్మాత ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మొత్తంగా ఈ మధ్య కాలంలో తెలుగు నుంచి బాలీవుడ్ కు వెళ్లిన దర్శకులెవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. మరి హను ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Related Articles

Back to top button