స్వామి ఉత్తరం..మంత్రికి ఇరకాటం

విశాఖపట్నం శారదాపీఠం అదిపతి స్వరూపానందేంద్ర నుంచి వచ్చిన ఒక లేఖ ఎపి దేవాదాయ శాఖ మంత్రిని సమస్యలలోకి నెట్టిందని ఒక వార్త వచ్చింది.శారదా పీఠంలో వచ్చే నెల మూడు నుంచి ఫిబ్రవరి మూడు వరకు సనాతన హిందూ దర్మం పై నెల రోజుల పాటు సదస్సులు జరుగుతాయని, అవసరమైన ఆర్దిక సాయం చేయాలని స్వామీజీ లేఖ రాశారు.ఆ లేఖను చూసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ కమిషనర్ కు పంపించి, తగు సాయం చేయాలని కోరారు. కమిసనర్ వివిద ప్రధాన దేవాలయాలకు లేఖలు రాసి ,మీరు ఆ సదస్సుకు ఏమైనా సాయం చేయగలరా అని అడిగారట. దీంతో ఇది పెద్ద వివాదం అయింది. స్వామీజీ సదస్సులకు ఆలయాలు డబ్బు ఎలా ఇస్తాయని కొందరు విమర్శలు ఆరంబించారు.దాంతో మంత్రికి ఇరకాటం ఏర్పడిందని ఒక పత్రిక రాసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend