స్వర్ణ కారులను ఆదుకోండి..జగన్ కు లోకేష్ లేఖ!

ఎపి సి.యం జగన్ కు నారా లోకేష్ లేఖ వ్రాశారు.లాక్ డౌన్ అనేక మంది కి ఉపాధి లేకుండా చేసి ఆర్థికంగా దెబ్బ తీసిందని అన్నారు .అలా ఉపాధి కోల్పోయిన వారిలో స్వర్ణ కారులు కూడా వున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.వాస్తవానికి ఈ సీజన్ లో పండగలు పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి వారికి మంచి ఆదాయం ఉండేది.కానీ ఇప్పుడు ఆదాయం లేక దాదాపు గా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది స్వర్ణ కారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖ లో రాశారు.వారందరికీ నిత్యావసర సరుకులు,మందుల తో పాటు ఆర్ధిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.వారి కోసం భవిష్యత్తు లో ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు లోకేష్..ఆ లేఖ ను ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు..

Related Articles

Back to top button
Send this to a friend