సెలబ్రిటీస్ మాటలు పట్టించుకుంటారా..?


దేశంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ముందుగా స్పందించేది సినిమా సెలబ్రిటీసే. వారి నుంచి ఆర్థిక, హార్థిక సాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా స్టార్ హీరోలంతా ఇలాంటి సందర్భాల్లో ముందే ఉంటారు. అయితే ప్రస్తుతం వచ్చిన కరోనా వైరస్ ప్రకృతి విపత్తు కాదు కాబట్టి.. అలాంటి సాయం కంటే తమ అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ వ్యాధి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ.. ప్రతి హీరో ఏదో ఒక విధంగా ఆడియన్స్ కు సందేశం అందిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వాలు కూడా ఇదే పనిచేస్తున్నాయి. కానీ సినిమా స్టార్స్ చేసే ప్రచారానికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే వాళ్లంతా ముందుకు వస్తన్నారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ కలిసి పెట్టిన వీడియోకు అద్బుతమైన స్పందన వచ్చింది. మహేష్ బాబు సోషల్ మీడియాలో హెచ్చరించాడు. లేటెస్ట్ గా మెగాస్టార్ కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయితే వీళ్లు ఇలా వ్యాధిపై అవగాహన కలిగిస్తూ.. అది విస్తరించకుండా చేసే హెచ్చరికలు బానే ఉన్నాయి.
అలాగే తమ ఫ్యాన్ సంఘాలతో కాస్త సోషల్ సర్వీస్ కూడా చేయిస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కొన్ని మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో వారికి మాస్క్ లు, శానిటైజర్స్ అందిస్తే బావుంటుందనేది కొందరి ఆలోచన. అయితే ఈ ఆలోచనను ముందుకు తెచ్చి ఆల్రెడీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు మంచు హీరో మనోజ్. అతని రూట్ లో హీరోలంతా కాకపోయినా వారి అభిమానులను కదిలించినా బావుంటుందేమో.

Related Articles

Back to top button
Send this to a friend