సునిశిత్ ను బుక్ చేసిన లావణ్య త్రిపాఠి

సునిశిత్.. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి నా భార్య అని తమన్నాను పెళ్లి చేసుకున్నానని.. మహేష్ కు హీరోగా గుర్తింపు ఇవ్వడానికి తను చేయాల్సిన ఒన్ నేనొక్కడినే సినిమా అతనికి ఇచ్చానని చెబుతూ వస్తున్నాడు. బాహుబలిలో పాటలు పాడానని.. జబర్దస్త్ కు యాంకరింగ్ చేశానని.. అబ్బో మనోడు యూ ట్యూబ్ లో రచ్చరచ్చ చేస్తున్నాడనుకోండి. అయితే అతన్ని చూస్తున్నప్పుడు మెంటల్లీ ఇంబాలన్స్ డ్ అనిపించక మానదు. అయినా యూ ట్యూబ్ ఛానల్ల పైశాచిక ఆనందానికి అతనికి పిచ్చ కూడా తోడై మొత్తంగ జనాల్లో ఓ రకమైన కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. ఇక ఇతని అరాచకానికి ఎండ్ కార్డేసింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.
లేటెస్ట్ గా తన గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోన్న ఇతనిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. తన గురించి అడ్డగోలుగా మాట్లాడుతూ అబద్ఢాలు చెబుతోన్న సునిశిత్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కంప్లైంట్ చేసింది. దీంతో పోలీస్ లు రంగంలోకి దిగారు. విషయం తెలిసిన సునిశిత్ కనిపించకుండా పోయాడు. కొసమెరుపేంటంటే.. ఇప్పటి వరకూ ఈ పిచ్చివాడిని ఇంటర్వ్యూస్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై సైతం కంప్లైంట్ నమోదైంది. ఆ మేరకు వారిని కూడా పోలీస్ లు అరెస్ట్ చేసి విచారిస్తున్నారట. ఏదేమైనా సునిశిత్ అనేవాడు ఓ పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు. అయినా హద్దు మీరి ప్రవర్తించాడు. యూ ట్యూబ్ ఛానల్స్ అతన్ని రెచ్చగొడుతూ, ఎంకరేజ్ చేస్తూ తమ వ్యూస్ కోసం చేసిన వ్యవహారం ఇప్పుడు వారి ‘ట్యూబ్’ కే చిక్కుకుంది.

Related Articles

Back to top button
Send this to a friend