సుకుమార్ కు గట్టి టార్గెట్ పెట్టిన అల్లు అర్జున్ ..?


అల వైకుంఠపురములో సినిమా భారీ విజయం సాధించిన తర్వాత సుకుమార్ తో సినిమాకు సిద్ధమయ్యాడు అల్లు అర్జున్. చాలాకాలంగా వినిపిస్తున్నట్టుగానే ఇది ఎర్రచందనం స్మగ్లర్స్ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమానే. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీని కేరళ అడవుల్లో షూటింగ్ చేయాలనుకున్నారు. బట్ కరోనా ఎఫెక్ట్ తో ఆ షెడ్యూల్ వాయిదా పడింది. అయినా ఆలస్యం కాకూడదని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, రంపచోడవరం ప్రాంతంలో కొన్ని చోట్లా లొకేషన్స్ ఫైనల్ చేస్తున్నాడు సుకుమార్. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో అన్ని షూటింగ్ లనూ బంద్ చేయించినా ఇతను మాత్రం ప్రీ ప్రొడక్సన్ వర్క్స్ చేయడానికి కారణం అల్లు అర్జున్ పెట్టిన టార్గెట్ రీచ్ కావడానికే అంటున్నారు.
ఇంతకీ బన్నీ ఇచ్చిన టార్గెట్ ఏంటంటే.. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు విడుదల చేయాలంటున్నాడట. మీరు విన్నది కరెక్టే. ఈ సినిమమాను దసరాకే విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట అల్లు అర్జున్. ఇప్పటికే ఆ టైమ్ లో కెజిఎఫ్, ప్రభాస్ సినిమాతో పాటు మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా కూడా స్లాట్ అయి ఉంది. అయినా ఆ టైమ్ కే తనూ రావాలనుకుంటున్నాడటంటే కారణం.. ఆ పోటీలో నిలిచి గెలిస్తేనే తనకు మజా అనే ఫీలింగ్ లో ఉన్నాడట. అందుకోసమే హాలిడేస్ అయినా సుకుమార్ సూపర్ స్పీడ్ తో ఉన్నాడని చెబుతున్నారు. చూస్తుంటే అల్లు అర్జున్ అన్నంత పనీ చేసి దసరాకే వచ్చేలా ఉన్నాడు.

Related Articles

Back to top button
Send this to a friend