అలా అనడం బాధ కలిగించింది:పి.వి.సింధూ

భారత్ లో క్రీడలకే కాదు క్రీడాకారులకు కూడా బోలెడుమంది అభిమానులు ఉంటారు.ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్ లకు,ఇక మన యువ మహిళా క్రికెటర్లు స్మృతి మందానా,జెమియా రోడ్రీగ్స్ కి ఐతే మిలియన్ల లో ఫాన్స్ ఉన్నారు.అందుకే వీరిద్దరితో కలిసి “డబుల్ ట్రబుల్” పేరిట కొత్త వెబ్ షో ను స్టార్ట్ చేసింది ఓ నిర్మాణ సంస్థ.ప్రముఖులు, ప్రత్యేకించి వివిధ క్రీడలకు చెందిన వారిని ఇంటర్వ్యూ చేసి,వారి అనుభవాలను తెలుసుకోవడం అనేదే కాన్సెప్ట్ గా డబుల్ ట్రబుల్ అనే షో ప్రారంభం అయింది. ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా వాల్డ్ ఛాంపియన్ ,బాడ్మింటన్ ప్లేయర్ పి.వి‌.సింధు వచ్చింది.ముగ్గురూ కలిసి షో ను అదరగొట్టారనే చెప్పాలి.ఐతే సింధూ కూడా చాలా ఓపెన్ గా సమాధానాలు చెప్పింది.ఆటలో గెలుపు ఓటమి సహజమని కానీ ప్రతి ఆట ను గెలిచెేందుకే చివరి వరకూ తాను ప్రయత్నం చేస్తానని చెప్పింది సింధు.ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచాక అందరూ తనని చాలా కాలం సిల్వర్ సింధూ అని పిలిచారని ,ఐతే వాల్ట్ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణం గెలిచాక పరిస్థితులు చాలా మారిపోయాయని చెప్పింది. ఐతే ఫిజికల్ ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ,శారీరక సమస్య ల ని అధిగమిస్తూ మహిళా క్రీడాకారులు,అథ్లెట్ లు రాణించగలుగుతున్నారని అంది సింధూ.ఇంకా ఒత్తిడి ని ,విమర్శలను అధిగమించడం కూడా ముఖ్యం అని తమ తమ అనుభవాలను పంచుకున్నారు సింధూ,మందానా ,జెమియా.ఇండియన్ విమెన్ క్రికెట్ టీం కూడా అద్భుతంగా రాణిస్తోందని అభినందనలు తెలిపింది సింధూ. చాలా సరదాగా సాగింది ఈ డబుల్ ట్రబుల్ ఇంటర్వ్యూ.బేస్ లైన్ వెంచర్స్ యూ ట్యూబ్ ఛానల్ లో ఈ షో ని చూడొచ్చు.

Related Articles

Back to top button
Send this to a friend