సిద్ధ్ ను ఆర్పీ పట్నాయక్ అంటున్నారా..?

2000లో టాలీవుడ్ లోకి చిత్రంతో దూసుకువచ్చాడు ఆర్పీ పట్నాయక్. తన సంగీతంతో ఎన్నో సినిమాలను నిలబెట్టాడు. ఆ రోజుల్లో యూత్ ఫుల్ సాంగ్స్ అంటే పట్నాయక్ స్వరపరిచినవే. ఆ సినిమాల్లో ఎక్కువ పాటలు కూడా తనే పాడుకున్నాడు. అయితే రాన్రానూ అవన్నీ ఒకేలా వినిపించడం మొదలైంది. ఏ పాటైనా ఒకేలా అనిపించడం కూడా ప్రారంభమైంది. ఆ టైమ్ లోనే అతనికి ఆఫర్స్ తగ్గాయి. హీరోల స్వరాలను బట్టి కాక తన స్వరాన్నే అందరు హీరోలకు వినిపించాలన్న తాపత్రయంతో చివరికి సంగీతమే చేయకుండా అయిపోయాడు ఆర్పీ. ఇప్పుడు అతనిలానే అనిపిస్తున్నాడు సిద్ధ్ శ్రీరామ్.
2013లో కడలి సినిమాలోని డబ్బింగ్ సాంగ్స్ తో తెలుగు వారికి పరిచయం అయ్యాడు శ్రీరామ్. ఆ తర్వాత చాలా పాటలు పాడాడు. బట్ గీత గోవిందంలోని ఇంకేం ఇంకేం కావాలే పాటతో తెలుగులో ఫేమ అయ్యాడు. అటుపై అతనితో చాలా సినిమాల్లో ఒక్కో పాటను పాడిస్తూ వస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఈ పాటలన్నీ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా యూ ట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. కానీ తరచి చూస్తే కుర్రాడి గాత్రమే కాదు.. పాటలు కూడా ఒకేలానే అనిపిస్తున్నాయనేది నిజం. మరీ ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో పాడిన పాటలు మరీ ఆల్రెడీ విన్నట్టుగానే అనిపిస్తున్నాయి. అంటే ట్యూన్స్ కొత్తవే, సాహిత్యమూ కొత్తదే. కానీ సిధ్ధ్ పాడుతుంటే అందులో కొత్తదనం కనిపించడం లేదు అనేది నిజం. అతను కూడా ఆర్పీ పట్నాయక్ లా రొటీన్ గా అనిపిస్తున్నాడు. ఇప్పటికిప్పుడే కాకపోయినా.. ఈ అభిప్రాయం పరిశ్రమలోనూ కలగడానికి పెద్గగా టైమ్ పట్టేలా లేదు అంటున్నారు.

Related Articles

Back to top button
Send this to a friend