సాయి తేజ్ ప్రస్థానం మార్చుతున్నాడా..?

సాయిధరమ్ తేజ్ నుంచి సాయితేజ్ మారిన తర్వాత విజయాలు వచ్చాయని నమ్ముతున్నాడీ మెగా హీరో. అది నిజమేఅనేందుకు గత రెండు సినిమాలూ అతనికి మంచి రిజల్ట్స్ నే ఇచ్చాయి. రీసెంట్ గా మారుతి డైరెక్షన్ లో చేసిన ప్రతి రోజూ పండగే కమర్షయిల్ గా పెద్ద హిట్ అందుకుంది. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. అయితే ఈ మూవీ తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. తొలి సినిమాతో విమర్శకులను మెప్పించిన దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు సాయితేజ్.
ప్రస్థానం మూవీతో అద్భుతమైన అప్లాజ్ అందుకున్నాడు దేవా కట్టా. కానీ ఆ తర్వాత ఆ స్థాయి సినిమాలేవీ అతన్నుంచి రాలేదు. ఆటోనగర్ సూర్యతో ఆకట్టుకున్నా.. ఆ సినిమాకు హీరో స్టేచర్ సరిపోలేదు. మంచు విష్ణుతోచేసిన డైనమేట్ సైతం అస్సలు పేలలేదు. ఇక రీసెంట్ గా తన ప్రస్థానం సినిమానే బాలీవుడ్ లో సంజయ్ దత్ హీరోగా రీమేక్ చేశాడు. నవంబర్ లో విడుదలైన ఈ మూవీ సైతం డిజాస్టర్ గా మిగిలింది. ఓ రకంగా దేవా కట్టాను అంతా మర్చిపోయారు అనే చెప్పాలి. ఈ టైమ్ లో సాయితేజ్ అతన్ని నమ్మి సినిమాకు ఒప్పుకోవడం అంటే విశేషమనే చెప్పాలి.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది. ఇది కూడా దేవా కట్టా మార్క్ సినిమానే అంటున్నారు. భగవాన్, పుల్లారావు నిర్మించే ఈ సినిమాతో సాయితేజ్ కూడా తన ఇమేజ్ ను కొత్తగా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాడట. చూద్దాం.. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.

Related Articles

Back to top button
Send this to a friend