‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ పెద్ద హిట్ అవ్వాల‌: యాంక‌ర్ సుమ‌.

మా సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ తప్పకుండా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా – ప్రీ రిలీజ్ఈవెంట్‌లో ముఖ్యఅతిథి స్టార్ యాంక‌ర్ సుమ‌.

‘జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి, ట్రైలర్ , పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 28న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, స్టార్‌ యాంకర్ సుమ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, యాంక‌ర్‌ ప్రదీప్, రవి తో పాటు జబర్దస్త్ , ఢీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ అదిరిపోయే స్టెప్పులతో పాటు పాట పాడి ఫ్యాన్స్ ని అలరించారు.
ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ మాట్లాడుతూ – “శేఖర్ రాజు గారు సైకిల్ మీద హైదరాబాద్ కి వచ్చి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఇప్పుడు ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమా ద్వారా తాను నిర్మాతగా మారి ఇండస్ట్రీలో ఎంతోమందికి మంచి దారి చూపించాడు. ఈ సినిమా టైటిల్ సాఫ్ట్ గా ఉండొచ్చు కానీ మూవీ చాలా హార్డ్ గా ఉంటుంది. దర్శకుడు రాజశేఖర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే రైతుల గురించి మంచి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చారు. సుధీర్ డాన్సులతో పాటు ఫైట్స్ ఇరగదీసాడు. డిసెంబర్ 28 న ప్రతి ఒక్కరూ సినిమా చూడండి” అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend