సమంత, నయనతార .. అనుకున్నదే జరిగిందా..?

ఇద్దరు ఆడవాళ్లు ఒకే చోట ఉంటే కుదురుగా ఉండటం కష్టం అంటారు. అలాంటిది క్రియేటివ్ ఫీల్డ్ లో ఒకే సినిమాలో నటిస్తే మాత్రం కుదురుతుందా. అదీ ఇద్దరూ టాప్ సూపర్ స్టార్స్ అయినప్పుడు ఇంకా ఇబ్బందిగా మారుతుంది. అలాంటి ఇబ్బందే నయనతార, సమంతల మధ్య తలెత్తిందనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. జాను సినిమా డిజాస్టర్అయిన తర్వాత సమంత తెలుగులో సినిమాలు ఒప్పుకోలేదు. కానీ తమిళ్ లో నయనతార లవర్ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాలో చేయడానికి ఓకే చేసింది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నయనతార కూడా ఉంది. అప్పుడే ఈ ఇద్దరూ కలిసి నటించడం కష్టం అనే మాటలు వినిపించాయి. కానీ ఆ మాటల్ని ఇద్దరూ కొట్టిపారేశారు. కట్ చేస్తే కొన్ని రోజుల క్రితం సెట్స్ లోనే ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చాయట. దర్శకుడితో పాటు హీరో కూడా కలగజేసుకుని అప్పటికి మేటర్ క్లియర్ చేశారని వినిపించింది.
అయితే లేటెస్ట్ గా మరోసారి నయన్ అండ్ శామ్ ల మధ్య గొడవలు మొదలయ్యాయని.. అందుకే సమంత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనేది కొత్త వార్త. ఈ వార్తకు సంబంధించి అఫీషియల్ న్యూస్ అంటూ ఏం లేకపోయినా నింద మొత్తం సమంత వైపు కనిపించేలా కోలీవుడ్ లో కొందరు పావులు కదుపుతున్నారంటున్నారు. అందులో భాగంగా శామ్ ప్రెగ్నెంట్ అయిందని.. ఆ కారణంగానే తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అనేలా రూమర్స్ వస్తున్నాయి. నిజానికి వీటి వెనక ఓ కారణం కూడా లేకపోలేదు. సమంత ప్రెగ్నెంట్ అంటే అప్పుడు అందరూ ఆ మేటర్ పై ఫోకస్ పెడతారు. దీంతో నయన్ తో గొడవ విషయం నిజం కాదు అనేది అర్థం చేసుకుంటారు. అంటే వేళ్లు నయన్ వైపు ఉండవు. బట్.. ఈ మధ్య ఏం జరిగినా నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి సమంత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వార్త ముందు నిజమైతే ఆ తర్వాత ఈ ప్రెగ్నెంట్ దాని కథా బయటకు వస్తాయి కదా.. ఏదేమైనా ఇద్దరు టాప్ హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటించడం దాదాపు కష్టం అని మరోసారి ఈ ఇద్దరూ నిరూపిస్తున్నారనే చెప్పాలి.

Related Articles

Back to top button
Send this to a friend