సంచలన నిర్ణయం తీసుకున్న మాలీవుడ్

మళయాల చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నిర్ణయం చైనా తర్వాత తీసుకున్నది కేరళ రాష్ట్రమే. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్ కేరళలో కాస్త ఎక్కువగానే ఉంది. అయినా దాన్ని కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం ప్రశంసనీయమైన చొరవ తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకూ ప్రతి ఒక్కరిలోనూ అవేర్ నెస్ తెచ్చింది. అయితే కరోనా ప్రధానంగా కాస్త ఎక్కువ మంది ఉండే చోట ఒక్క వ్యక్తికి ఉన్నా.. ఆ గుంపు మొత్తానికి అత్యంత సులువుగా సోకుతుంది. అందుకే మళయాల చిత్ర పరిశ్రమ ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది.
ఈ నెల 11 నుంచి చివరివరకూ అంటే మార్చి 31 వరకూ ఆ రాష్ట్రంలోని అన్ని థియేటర్స్ ను మూసి వేస్తున్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అఫీషియల్ గానే ప్రకటించారు. ఇందుకోసం సినిమా పరిశ్రమకు చెందిన అన్ని సంఘాల వాళ్లు కలిసి చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారట. మామూలుగా మన దేశంలో వైరస్ లాంటి భయంకరమైన వ్యాధులు ఏవొచ్చినా ముందుగా ఎఫెక్ట్ అయ్యేది కేరళ రాష్ట్రమే. అందుకే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ నెలలో చాలా పెద్ద సినిమాలే విడుదలకు ఉన్నాయి. అయినా వాటిని కాదని ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారంటే మాలీవుడ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Articles

Back to top button
Send this to a friend