శ్రీ విష్ణు పెద్ద దొంగట

శ్రీ విష్ణు.. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. కాన్సెప్ట్ బేస్డ్.. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శ్రీ విష్ణు ఎప్పుడూ ముందే ఉన్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, జయమ్ము నిశ్చయమ్మురా, నీదీనాదీ ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాల లైనప్ చూస్తే చాలు.. అతని టాలెంట్ అండ్ సెలెక్షన్ తెలియడానికి. ప్రతి సినిమా కమర్షియల్ విజయం సాధించకపోవచ్చు. కానీ అన్ని సినిమాలతోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోన్న శ్రీ విష్ణు బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశాడు.
రాజరాజ చోర.. ఇదే శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్. చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అతని లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. పౌరాణిక పాత్రను పోలిన గెటప్ తో ఎవరినో తప్పించుకుంటూ పరుగులు పెడుతున్నట్టుగా ఉన్న ఈ లుక్ తో మరోసారి తనో డిఫరెంట్ సినిమాతోనే వస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు శ్రీ విష్ణు. టైటిల్ ను బట్టి అతను ఈ సినిమాలో ఆరితేరిన దొంగలా కనిపిస్తాడు అని వేరే చెప్పక్కర్లేదు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈచిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏప్రిల్ లో షూటింగ్ పూర్తవుతుందట. అందుకే మరీ టీజర్, లేదా మోషన్ పోస్టర్ అంటూ ముందే హడావిడీ చేయలేదనిపిస్తోంది. దీన్ని బట్టి సినిమా సమ్మర్ చివరలో అంటే జూన్ లేదా జూలైలో వస్తుందనుకోవచ్చు. మరి ఈ మూవీతో శ్రీ విష్ణు ఎలాంటి వైవిధ్యం చూపిస్తాడో చూడాలి

Related Articles

Back to top button
Send this to a friend