శ్రీ రెడ్డిపై కేస్ పెట్టిన రామారావు

కొన్నేళ్లుగా సోషల్ మీడియలో హల్చల్ చేస్తూ తన లైఫ్ స్టైల్ ప్రచారానికి వాడుకుంటూ ఓ దశలో ఇండస్ట్రీలో చాలామందిని ఇన్ డైరెక్ట్ గా భయపెట్టిన నటి శ్రీ రెడ్డి. ఆమె ఇక్కడ చేసిందే రెండు మూడు సినిమాలు. కానీ తనో పెద్ద నటి అనే భావనలో ముందు నుంచీ ఉంది శ్రీ రెడ్డి. అయితే తనపై ఇతర ఆర్టిస్టులు ఆరోపణలు చేయడం.. వాటికి తను అబ్యూజింగ్ గా పోస్టులు సాధారణమైపోయింది. ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయిన శ్రీ రెడ్డికీ ఇక్కడ కరాటే కళ్యాణి, డ్యాన్స్ మాస్టర్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ కు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. దీంతో ఒకరిపై ఒకరు తమను చంపాలనుకుంటున్నారని ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తనకు శ్రీ రెడ్డి అనుచరులు, అభిమానుల నుంచి చంపుతామనే బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమెపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టాడు రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ కేస్ ను పోలీస్ లు తీసుకున్నారు. శ్రీ రెడ్డితో పాటు బెదిరింపు కాల్స్ చేసిన వారిని విచారించి కేస్ ఫైల్ చేస్తామని చెబుతున్నారు పోలీస్ లు.

Related Articles

Back to top button
Close
Send this to a friend