శ్యామ్ సింగ రాయ్’ గా హీరో ‘నాని’

nani as syam singroy

నాచురల్ స్టార్ ‘నాని’ హీరోగా ‘జెర్సీ’ వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన ఉత్తమ కధా చిత్ర్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి ‘నాని’ హీరోగా చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘టాక్సీ వాలా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘రాహుల్ సాంకృత్యన్’
దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ. కాగా ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ ‘ అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర కథానాయకుడు నాచురల్ స్టార్ ‘నాని’ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించింది చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని, వీడియోను తమ అధికారిక సామాజిక మాధ్యమం అయిన యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో 2020 డిసెంబర్ 25 న చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు. హీరో ‘నాని’ కి ఇది 27 వ చిత్రం. చిత్రం ప్రారంభం,చిత్రానికి సంబంధించిన ఇతర నటీ,నట, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఈ చిత్రానికి సమర్పణ పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

Related Articles

Back to top button
Send this to a friend