శేఖర్ కమ్ములకు ప్లస్ అయిన కరోనా 

ఒక సినిమాను తీయడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు దర్శకులు ఒక రోజు ఎన్ని ఎక్కువ షాట్స్ లేదా సీన్స్ తీద్దామా అనే విషయంపై ఎక్కువ దృష్టి పెడతారు. అలాంటి వారిలో మనకు పూరీ జగన్నాథ్ ముందుంటాడు. మరీ ఎక్కువ సేపు జడ్జ్ చేయకుండానే సీన్ ఫినిష్ చేస్తాడు. ఇతరుల్లో అతని స్పీడ్ ఎవరికీ లేదు. మరికొందరు ఒక్కో సీన్ ను రోజుల తరబడి చెక్కుతుంటారు. కానీ వాళ్లు ఏం అనుకున్నారో అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఈ కోవలో మనకు శేఖర్ కమ్ముల కనిపిస్తాడు. యస్.. శేఖర్ సినిమా షూటింగ్ అంటే ఎప్పుడు ప్యాకప్ చెబుతాడో ఎవరికీ తెలియదు అంటారు. అంటే ఎంతో రాత్రి వరకైనా షూట్ చేస్తాడు అని కాదు.. ఆర్టిస్టుల కాల్షీట్స్ సగంలో ఉండగా కూడా ప్యాకప్ చెబుతుంటాడు. ఆయన మూడ్ మారితే ఆ రోజు షూటింగ్ బంద్. అలాగని సీన్ విషయంల కాంప్రమైజ్ కాడు. ఈ కారణంగానే శేఖర్ సినిమాలకు చాలా టైమ్ పడుతుంది.
ఇక ఇప్పటికే విడుదలకు సిద్ధం కావాల్సిన అతని లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే అంతా దీన్ని నాగచైతన్యకు డ్యాన్స్ సరిగా రాకపోవడం వల్లే ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు. అలా అనుకుంటే అతనికి డ్యాన్స్ రాదన్నవిషయం శేఖర్ కు తెలియదు అనుకోవాలా..? మొత్తంగా ఇప్పటికే చాలామంది ఈ మూవీ షూటింగ్ పై సెటైర్స్ వేస్తన్నారు. ఈ టైమ్ లో కరోనా శెలవులు శేఖర్ కు కలిసొస్తున్నాయి. అంటే తన సినిమా ఆలస్యం అయిందని.. అవుతుందని ఎవరూ అనరు కదా ఇంక. అలాగని కరోనా వచ్చి అతనికి మేలు చేసింది అని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశ్యం. కేవలం అతని నుంచి చాలా మంది లుక్ డైవర్ట్ అవుతుందని మాత్రమే. మొత్తంగా ఈ లవ్ స్టోరీపై అంచనాలు మాత్రం భారీగానే పెరుగుతున్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా ఈ దర్శకుడికి ఫిదా అయిన వాళ్లు కూడా ఫీల్ అవుతారు మరి.

Related Articles

Back to top button
Send this to a friend