శర్వానంద్ తో కాదు సాయి తో పోటీ అంటోన్న బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్.. హీరోగా నిలదొక్కుకునేందు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమం లో చాలా ప్రయోగాలు కూడా చేసాడు. మొత్తం గా అది ఫలించి రీసెంట్ గా రాక్షసుడు తో పెద్ద హిట్ అందుకున్నాడు. దీంతో ఇక వైవిధ్యమైన సినిమాలు చేస్తాడు అనుకుంటే అతను మాత్రం మళ్ళి మాస్ అంటూ మూస ధోరణికి ఓటు వేసాడు. కందిరీగ, రభస ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఇది ఓ రకంగా ఔట్ డేటెడ్ కథ అని వినిపిస్తోంది. హీరో ఇంటికి వెళ్లి అందరినీ బకరాలను చేసే శ్రీను వైట్ల మార్క్ సినిమా అంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్నదాన్ని బట్టి ఈ చిత్రానికి కందిరీగ-2 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారట.  మరి బెల్లంకొండ మల్లి ఈ ఫార్మాట్ ను ఎందుకు ఎంచుకున్నాడో కానీ ఇప్పటికే సినిమా బిజినెస్ కాలేడు అనే టాక్ ఉంది. ఐన రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారు.
ఇక సినిమాను వేసవి బరిలోనే నిలిపారు. ఏప్రిల్ 24 న విడుదల చేయాలనుకుంటున్నారు. ఐతే అదే రోజు శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ఉంది. శ్రీకారం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అదే జరిగితే 24 న బెల్లంకొండ దిగుతాడు. లేదంటే మే 1 న రావాలనుకుంటున్నాడు. బాట్ ఆ రోజు కూడా మెగా కుర్రాడు సాయి తేజ్ ఉన్నాడు. ఐన సాయి కి పోటీగా దిగేందుకు ఇబ్బంది పడటం లేదట. నిజానికి ఇప్పుడు శర్వా కంటే సాయి నే కాస్త స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఐన బెల్లంకొండ శర్వాకు భయపడుతున్నదంటే సాయిని లైట్ తీసుకుంటున్నట్టే కదా.
ఇక ఇప్పుడున్న సిట్యుయేషన్ లో శర్వా సినిమా పోస్ట్ పోన్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయ్. అందువల్ల బెల్లంకొండ ఏప్రిల్ 24  నే రావొచ్చు.

Related Articles

Back to top button
Send this to a friend