శర్వానంద్ కూడా హ్యాండ్ ఇస్తున్నాడా…?

బ్యాడ్ టైమ్ అంటే ఆ డైరెక్టర్ దే. లేదంటే ఫస్ట్ మూవీతో బెస్ట్ హిట్ అందుకుని మరో సినిమా ప్రారంభించడానికి మూడేళ్లు టైమ్ పడుతోందంటే ఖచ్చితంగా అది బ్యాడ్ టైమ్ కాక మరేంటీ. పైగా అతను చెప్పిన కథ ఇప్పటికే టాలీవుడ్ లోని మీడియం రేంజ్ హీరోలందరి చుట్టూ తిరిగి వచ్చింది. ఓ దశల రవితజ కూడా చేయబోతున్నాడు అన్నారు. కానీ అతను హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఫైనల్ గా శర్వానంద్ ఓకే చెప్పాడు. కానీ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఉన్న శర్వానంద్ కూడా ఈ దర్శకుడికి హాండ్ ఇవ్వబోతున్నాడా అనే టాపిక్స్ టాలీవుడ్ లో హాట్ హాట్ గా వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో ఊహించారు కదా.. యస్.. అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్ భూపతి. పరిమిత బడ్జెట్, పాత్రలు, లొకేషన్స్ తో అతను ఓ అద్భుతాన్నే క్రియేట్ చేశాడు. తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ ఇంత వరకూ రాకపోవడంతో అంతా ఫిదా అయ్యారు. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా 12 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. కానీ ఆ వెంటనే మరో సినిమా చేయలేకపోయాడు అజయ్. అదే టైమ్ లో అతని తండ్రి చనిపోవడం, కొంత గ్యాప్ తర్వాత పెళ్లి చేసుకోవడంతో తన నెక్ట్స్ సినిమా ఆలస్యం అయింది.
అయినా గ్యాప్ వచ్చినప్పుడుల్లా తన కొత్త కథ ‘మహాసముద్రం’తో అందరు యంగ్ స్టర్స్ ను కలిశాడు. అంతా కథ బావుందన్నారు. కానీ ఎవరూ ఓకే చెప్పలేదు. ముందుగా నాగచైతన్యతో అనుకున్నాడు. అతను తన స్టేచర్ సరిపోదన్నాడు. అటుపై రామ్ వద్దకు వెళితే ఈ కథకు నేను సరిపోను అన్నాడు. అలా మరికొంతమందిని కలిసిన ఈ కథ ఫైనల్ గా రవితేజ ఒప్పుకున్నాడు. బట్ ఆరు నెలలు నాన్చిన తర్వాత అతనూ నో అన్నాడు.
ఇక చివరగా శర్వానంద్ ఒప్పుకున్నాడు.త్వరలోనే పట్టాలెక్కాల్సిన సినిమా ఇది. కానీ లేటెస్ట్ గా శర్వానంద్ కూడా వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. ఈ టైమ్ లో ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా అనుకుంటున్నాడట. అందుకే శర్వా రీ థాట్ లో పడ్డాడని టాక్. దీంతో మహా సముద్రం మళ్లీ కొత్త హీరోను వెదుక్కోవాల్సిందేనా అని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend