శర్వానంద్ కు రెస్ట్ ఇస్తోన్న కరోనా


కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్. చైనాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించింది. కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా మనదేశంలోనూ భయపెడుతోంది. ఇప్పటికే కేరళ, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు స్కూల్స్, కాలేజెస్, మాల్స్ ను ఈ నెల 31 వరకూ మూసివేయాలని ఆదేశాలిచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా దీనివల్ల చాలామందికి శెలవులు వస్తున్నాయి. ఆ శెలవుల వల్లే శర్వానంద్ ఓ ఇబ్బంది నుంచి ప్రశాంతంగా కోలుకోబోతున్నాడు.
అసలు విషయం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం జాను సినిమా షూటింగ్ లో శర్వానంద్ గాయపడ్డాడు. భుజానికి పెద్ద దెబ్బ తగిలింది. అప్పుడు సర్జరీ అవసరం అన్నారు.కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు, కమిట్మెంట్స్ ఉండటంతో తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేయించుకుని జాను తో పాటు రీసెంట్ గా శ్రీకారం సినిమాను కూడా ఫినిష్ చేశాడు. ఈ మధ్యే అమెరికా వెళ్లి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఇండియాకు రాబోతున్నాడు శర్వానంద్. అయితే ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా రెండు వారాలకు పైగా రెస్ట్ అవసరం అని చెప్పారట డాక్టర్లు. కానీ శ్రీకారం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు, విడుదలకు ముందు చేయాల్సిన హడావిడీ కూడా ఉంటుంది కదా. దాని వల్ల భుజం మళ్లీ ఇబ్బంది పెడుతుందని భావించారు.
కానీ కరోనా ఎఫెక్ట్ తో బంద్ ప్రకటించడంతో దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ వెనక్కి వెళతాయి. అంటే శర్వానంద్ పూర్తిగా రెస్ట్ తీసుకుని ఆ తర్వాతే శ్రీకారం పనులు మొదలుపెట్టొచ్చు. అవసరమైతే మరో సినిమా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ రకంగా కరోనా శెలవులు శర్వానంద్ కు పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాయన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend