వైరల్ సాంగ్ పై గబ్బర్ సింగ్ ట్వీట్…!

గబ్బర్ సింగ్ గాంగ్ ను అభినందించారు పవన్ కళ్యాణ్..కరోనా బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు ఎవరికి తోచిన రీతిలో లో వారు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యం లోనే అనేకమంది పాటలు,వీడియోలు కూడా రూపొందించారు.
అదే స్ఫూర్తి తో గబ్బర్ సింగ్ సినిమా లో నటించిన కొందరు నటులు కలిసి ఒక రాప్ సాంగ్ ను విడుదల చేసారు..ఇపుడు ఈ సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో గబ్బర్ సింగ్ స్పందించారు…

పాట రూపొందించిన వారికి అందులోని నటులకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్..గీత రచయిత ప్రియాంక,మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్ మేఘ,ఇంకా ఇతర సాంకేతిక నిపుణులను పేరు పేరునా అభినందించారు.

కరోనా పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్..ఇప్పటికే జనసైనికులకు కూడా కష్ట కాలం లో ఏపీ లోని పేదల ను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలపునిచ్చారు..రాజకీయాల కు అతీతం గా సహాయం చేయాలని కూడా తన అభిమానులకు పిలుపు నిచ్చారు పవన్ కళ్యాణ్..

Related Articles

Back to top button