వైభవంగా లైఫ్ స్టైల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన మందాడి జగన్నాథం ట్రైలర్ విడులచేశారు.గోరేటి వెంకన్న పాటలు విడుదల చేయగా,సినీ ప్రముఖులు చేతుల మీదుగా చిత్ర యూనిట్ ఆడియో ను విడుదల చేశారు.

అనంతరం మందాడి జగన్నాథం మాట్లాడుతూ:- నాకు ఇష్టమైన వ్యక్తుల్లో నిర్మాత నరసింహ ఒకరు. చాలా కష్ట జీవి,సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి.అటువంటిది నిర్మాత కష్టమైనా ఇష్టపడి ఇంత మంచి సినిమా తీస్తాడనుకోలేదు. సినిమాపై నాకు అవగాహన ఉందిగాని, సినిమా ఫంక్షన్ లకు రావడం చాలా తక్కువ.అటువంటిది నిర్మాతపై ఉన్న ఇష్టంతో ఈ ఫంక్షన్ కు వచ్చాను.అందరూ నాది లక్కీ హాండ్ అంటారు.ఈ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు.

*గోరేటి వెంకన్న మాట్లాడుతూ:-ట్రైలర్,పాటలు బాగున్నాయి. పాటల్లో ప్రేక్షకులకు మసాలా బాగా వడ్డించారు.ఇది సినిమాలో ఒక ఎంజాయ్ మెంట్ మాత్రమే,ఎవరికి నష్టం జరగదు.హీరోయిన్ నడుము చూసి కొంతమంది టికెట్స్ కొంటారు.యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.జగన్నాథం గారిది మంచి లక్కీ హాండ్, ఆయన చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి మరిన్ని సినిమాలు తీయాలని అన్నారు.

Related Articles

Leave a Reply

Back to top button
Close