వెంకీ డైరెక్షన్ లో మహేష్ బాబు..?


సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మధ్య రెండు విజయాలతో ఊపుమీదున్న దర్శకుడు వెంకీ కుడుములతో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడనేదే  ఆ వార్త. యస్ మీరు చదివింది కరెక్టే. వెంకీ కుడుములతోనే. కొన్నాళ్లుగా తను రెగ్యులర్ టైప్ సినిమాలు చేసి బోర్ కొట్టడంతో రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు వంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేశాడు మహేష్ బాబు. టైమ్ కలిసొచ్చి ఈసినిమా మంచి విజయం సాధించినా ఎందుకో అంతగా నచ్చలేదు. అందుకే మరో మంచి ఎంటర్టైనర్ చేయాలనే ఉద్దేశ్యంతోనే వెంకీ కుడుముల చెబుతానన్న కథను విన్నాడట. ఆ పాయింట్ వినగానే మహేష్ బాబు చాలాబాగా నచ్చిందని టాక్. అందుకే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. నిజానికి వెంకీ కుడుముల కూడా కథ మొత్తం చెప్పేశాడని టాక్. అంటే అలా చెప్పే కథకు, బౌండెడ్ స్క్రిప్ట్ కు కొంచెం తేడా ఉంటుంది కదా.. అందుకే మహేష్ బాబు అలా తయారు చేయమన్నాడట.
ప్రస్తుతం మహేష్.. పరశురామ్ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా వెంకీ కుడుములతోనే సినిమా ఉంటుందని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది.
మరోవైపు తొలి సినిమా నాగశౌర్యతో చేసిన ఛలోతో సూపర్ హిట్ అందుకుని ఇంప్రెస్ చేశాడు వెంకీ. తర్వాత సితార బ్యానర్ లో నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సైతం కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది. దీంతో ద్వితీయ విఘ్నాన్ని కూడా సింపుల్ గా దాటేసిన వెంకీతో మహేష్ బాబు పెద్దగా ఇబ్బందేం ఉండకపోవచ్చు. మొత్తంగా ఇదైతే ప్రస్తుతం టాలీవుడ్ లో హాటెస్ట్ టాపిక్ అయిపోయింది.

Related Articles

Back to top button
Send this to a friend