‘వి’ నుంచి హాంటింగ్ మెలోడీ

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ తన ధోరణికి భిన్నంగా రూపొందిస్తోన్న థ్రిల్లర్ ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని వినిపిస్తోంది. ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల కాబోతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇక లేటెస్ట్ గా వి నుంచి తొలి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. వినగానే ఆకట్టుకునే హాంటింగ్ మెలోడీలా కనిపిస్తోందీ సాంగ్.
అల వైకుంఠపురములో సినిమాకు నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి అనే పాటతో ఆ సినిమా రేంజ్ ను విడుదలకు ముందే మార్చేసిన సాహితీ స్రష్ట సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, షాషా తిరుపతి తో పాటు యాజిన్ నిజార్ పాడారు. అమిత్ త్రివేదీ సంగీతం కూడా ఆకట్టుకనేలా ఉంది. సినిమాకు ఈ మెలోడీ ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈవేళ అంటూ సాగే ఈ మెలోడీలో అద్భుతమైన లిరికల్ వాల్యూస్ ఉన్నాయి. సినిమాలో మాంటేజ్ సాంగ్ కావొచ్చు అనిపించేలా ఉంది. మొత్తంగా వి కి టీజర్ తర్వాత పాటతో మరింత ఇంప్రెషన్ పడిందనే చెప్పాలి.

Related Articles

Back to top button
Close
Send this to a friend