విశ్వక్ సేన్ మామూలోడు కాదయ్యో

పాత హీరోయిన్లను గుర్తుపెట్టుకుని మరీ కొత్త సినిమాలో ఆఫర్ ఇవ్వడం అనేది టాలీవుడ్ లోనే కాదు.. ఏ వుడ్ లో అయినా అరుదుగా జరుగుతుంది. పైగా కెరీర్ ఇన్సియల్ డేస్ లోనే ఇలాంటి గుర్తులు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా వారి మధ్య చెరిగిపోని గుర్తులు ఏవో ఉంటాయనే రూమర్స్ రావడం కూడా సహజం. అయితే ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటోన్న హిట్ హీరో విశ్వక్ సేన్ కూడా ఓ భామను రిపీట్ చేస్తున్నాడు. తను హీరోగా లేటెస్ట్ గా ప్రారంభం అయిన ‘పాగల్’ సినిమాలో హీరోయిన్ గా సిమ్రన్ చౌదరిని తీసుకుంటున్నాడట. ఆమె కావాలని విశ్వక్ సేనే అడిగాడు అంటున్నారు.
ఇంతకీ ఈ భామ ఎవరా అనుకుంటున్నారా.. విశ్వక్ గతంలో నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో హీరోయిన్. మనోడికి ఎగ్జామ్ హాల్ లో పరిచయం అవుతుంది. పెన్ కూడా ఇస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ అయ్యి షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తారు. ఆ క్రమంలో వీరి మధ్య వచ్చే ఆగిఆగి చూసే కాలం పాట సూపర్ మెలోడీగానూ ఉంటుంది.. ఆ భామనే మనోడు రిపీట్ చేస్తున్నాడు. సిమ్రన్ టాలెంటెడ్ అనిపించుకుంది. కానీ ఎందుకో ఆ మూవీ తర్వాత పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఒకవేళ ఆ టాలెంట్ కోసమే విశ్వక్ తనను రిపీట్ చేస్తున్నాడేమో.. కానీ కుర్రాడు ఇలా ఆ భామకు ఆఫర్ ఇవ్వడంతో అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు చాలామంది.

Related Articles

Back to top button
Send this to a friend